సముద్ర తీరం…మాధవస్వామి దేవాలయం ఆకట్టుకున్న సత్యభామ శిలా ప్రతి రూపం in Gajuwaka,Visakhapatnam,Vizagvision…విశాఖ అంటేనే ఒక్క ప్రత్యేకత , ఒక్క పక్క సముద్రం , మరోపక్క సొగసయ్యన కొండలు , అన్నిటి మించి మంచి వాతావరణం …. అంతే కాకుండా పరిశ్రమలు … విశాఖ ఉక్కు మరొ వైపు గంగవరం పోర్టు ఈ రెండు పరిశ్రమల మద్య సముద్ర తీరాన ఒక్క ఎత్తుయైన కొండమీద వెలిసిన శ్రీ మాధవ స్వామి మహాలక్షి గుడి , 200 ఏళ్ళ పురాతన గుడి , పరిశ్రమల రావడం తో ఇక్కడ ఉన్న గ్రామాలను తరలించారు , అయ్యన సరే అ గ్రామస్తుల సముద్రతీరన ఉన్న సత్యభామ శిలను చేరేందుకు కొండమీదకు వచ్చి సత్యభామకు నైవేద్యం పెట్టి కనుమ పండగ చేసుకుంటారు , మాధవ మహలక్షి గంగవరం గ్రమం దేవాలయం ఫై “సి వి అర్ ” న్యూస్ ప్రత్యక కథనం …
ఈ సముద్ర తీరాన కొండల్లో ఒక రాయి పై వెలసిన శిలను గొల్ల భామ సత్యభామగా ఇక్కడ గ్రామస్తులు కొలుస్తారు, కనుమ పండుగ రోజు కుటుంబ సభ్యులతో వచ్చి మాధవ మహాలక్ష్మి గుడి దర్శించుకొని ,ఇక్కడున్న సత్యభామ శిల
వద్దకు చేరుకుని నైవేద్యం పెట్టి పూజలు నిర్వహిస్తారు, ఇది రెండు వందల సంవత్సరాల నుండి ఇక్కడ గ్రామస్తులు చేస్తున్న పూజలు ఆనవాయితీగా ఉంది , అయితే ఇక్కడికి చేరుకోవడానికి సరైన మార్గం లేక పోవడం ,ఇటు ప్లాంటు అటు గంగవరం పోర్టు పరిశ్రమ వారు సంవత్సరం పొడవునా మూసేసి ఒక్క కనుమ పండుగ రోజు వారి దారి ఇవ్వడం, గాజువాక నుంచి 25 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం వాహన సౌకర్యం ఉండదు, సొంతవాహనం మేధరావాలి , ఇక్కడకు వచ్చిన తరువాత ఈ గొల్ల భామ సత్యభామ వద్దకు చేరుకోవడానికి ఆ కొండల్లో ఎక్కి భక్తులు చేరుకుంటారు , అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు మాత్రం గంగవరం పోర్టు గానీ ఇటు స్టిల్ ప్లాంట్ గాని చొరవతీసుకుని గుడి అభివృద్ధికి తోడ్పడాలని, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తమ కి వెళ్లడానికి దారి ఇస్తారు మిగతా రోజుల్లో ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,
ఇక్కడ ఎన్నో సినిమాలు తీశారు అని ఒక్కప్పటి స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్ , మరొచరిత్ర , అభిలాష్ , చేలాంజి , వంటి హిట్ సినిమాలు తీసిన ప్రదేశమని , పర్యాటక ప్రాంతం కూడా అభివృద్ధి చెయ్యవచ్చు అని, ఇంతటి ప్రకృతి అందాలు అయినా చోటును, మా గుడిని మాకు ఇవ్వాలని ఈ నాలుగు గ్రామస్తుల కోరుతున్నారు ,

















