ఇవాళ 13 జిల్లాల్లో 128 డిపోల దగ్గర ధర్నాలు నిర్వహించామని ఈయూ నేతలు వై.వి.రావు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
19న ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరై టీఎస్ కార్మికులకు సంఘీభావం తెలుపుతామన్నారు.
అలాగే అదే రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని… ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు.
ముఖ్యమంత్రే ఆర్టీసీ కార్మికుల పట్ల కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కార్మికులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం భావ్యం కాదన్నారు.
సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

















