Weather Report on “Titli” Cyclone Crossed at Vajrapukotturu in Srikakulam,Vizag Vision…తితలీ తుపాను బీభత్సం… 8 మంది మృతి ,
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తితలీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి 8 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్టు కూలి మరొకరు మృతి చెందారు.
శ్రీకాకుళం జిల్లాలోని వివిధ మండలాల్లో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు
పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం -28.02 సెం.మీ
కోటబొమ్మాళి- 24.82 సెం.మీ
సంతబొమ్మాళి 24.42సెం.మీ
ఇచ్ఛాపురం – 23.76 సెం.మీ
టెక్కలి- 23.46 సెం.మీ
సోంపేట, మందస – 13.26సెం.మీ
కవిటి – 12.44 సెం.మీ
పొలాకి- 9.74 సెం.మీ
జలుమూరు 9.06 సెం.మీ
ఎల్ఎన్పేట-8.92 సెం.మీ
నరసన్నపేట -6.04 సెం.మీ
పొందూరు -5.8 సెం.మీ
లావేరు -4.94 సెం.మీ
శ్రీకాకుళం- 4.62 సెం.మీ
రణస్థలం-4.58 సెం.మీ
ఎచ్చెర్ల -4.48 సెం.మీ
బూర్జ- 4.28సెం.మీ
గార -4.02సెం.మీ
ఒడిశాలో గంజాం పోర్టు సమీపంలో 7 బోట్లు గల్లంతయ్యాయి. ఒక బోటులో వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. బోట్ల ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.