టిట్లీ పెను తుఫానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. తుఫానును వైపరీత్యాలను ఎదుర్కొనుటకు రెండు ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు సైతం జిల్లాకు వచ్చాయి. ఇనస్పెక్టర్ వి.సతీష్ కమార్ టీమ్ కమాండర్ గా ఉన్న బృందం శ్రీకాకుళం చేరుకుని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఇప్పటికే బస చేసింది. ఇనస్పెక్టర్ అంకిత్ తివారి టీమ్ కమాండర్ గా ఉన్న బృందం టెక్కలిలో బస చేయనుంది. జాతీయ రహదారి పొడవునా ఉన్న మండలాలు, గ్రామాల్లో ఎటువంటి విపత్తు సంభవించిన ఎదుర్కొనుటకు సిద్ధంగా బృందాలు ఉన్నాయి. ఒక్కో బృందంలో 35 మంది సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బందికి అవసరమైతే సాంకేతిక నిపుణులు తక్షణం అందుబాటులోకి రానున్నారు. శ్రీకాకుళం జిల్లాకు రెండు బృందాలు రాగా, విజయనగరం, విశాఖపట్నంలకు ఒక్క బృందం వెళ్లాయి. ఎన్.డి.ఆర్.ఎఫ్ సేవలు ఫైలిన్ తుఫానులో జిల్లా వాసులకు అద్భుతంగా అందించిన సంగతి విదితమే. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు ప్రకృతి వైపరీత్యాలైన తుఫాను, వరదల సమయంలో రక్షణ చర్యలు మాత్రమే కాకుండా భవనాలు కూలిపోయినప్పుడు, భవన శిధిలాల్లో మనుషులు ఉన్నప్పుడు వారిని రక్షించుటలోను, మెడికల్ ఫస్ట్ రెస్సాన్సర్స్ గాను, ఫైర్ ఫైటింగులోను, డెడ్ బాడీ మేనజిమెంటు లోను, ఏనిమల్ డిశాస్టర్ మేనేజిమెంటులోను, కెమికల్, బయలాజికల్, రేడియేషన్, న్యూక్లియర్ సంబంధిత సమయాల్లో రక్షణలోను సిద్ధహస్తులు.