భారత వాతావరణ శాఖ సూచన ప్రకారం
కళింగపట్నానికి 690కీ.మీ, గోపాలపూర్ కు 720 కీ.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
రానున్న 24 గంటల్లో వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం
రాగల 48 గంటల్లో తీవ్రవాయుగుండం బలపడి తుపానుగా మారే అవకాశం
దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరకోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు
తీరం వెంబడి గంటకు 65కీ.మీ వేగం వరకు ఈదురు గాలులు వీచే అవకాశం
మత్స్యకారులను వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ
ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల శాఖ
తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచన