సాయి మైరెన్ ఆక్వా కంపెనీ మాకొద్దు అంటూ అడ్ఢురోడ్డు నాలుగురోడ్ల కూడలిలో రేవుపోలవరం,కోత్తరేవుపోలవరం గ్రామస్తులు మానవహారం ద్వారా తమ నిరసన తెలియజేశారు.సాయి మైరెన్ ఆక్వా కంపెనీ ప్రాంగణం నుండి ఆందోళనకారులు పాదయాత్ర ప్రారంభించి,గుడివాడ కూడలిలో కొంతసమయం నిరసన తెలియజేసి 9 కిలోమీటర్లు మేర పాదయాత్ర కొనసాగించి అడ్డురోడ్డులో మానవహారం నిర్వహించారు.