HomeNewsDaspalla Land issue YSRCP Amar.. Vizagvision…తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని మంత్రులకు విశాఖజిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గులాంగిరీ చేస్తున్నారని, దసపల్లా భూములను కబ్జా చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైఎస్సార్సీపి విశాఖ నగర అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. వైెఎస్సార్ సీపి కార్యాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుదూద్ సమయంలో విశాఖజిల్లాలలో చాలా రెవిన్యూ రికార్డులు పోయాయని చెబుతున్న జిల్లా కలెక్టర్, అప్పటి జీవిఎంసి కమిషనర్ గా కోర్టు లో వున్న దసపల్లా ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులకు నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. విశాఖజిల్లాతోపాటు నగరంలో కూడా కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతుంటే రెవిన్యూ అధికారులు నిమ్మకు నీరత్తనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. రెండు మూడు కేసుల్లో తహశీల్దార్లను సస్పెండ్ చేసి చేతుతు దులుపుకుంటున్నారన్నారు. విశాఖ నగరంలో ఏకంగా అర ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి టిడిపి పార్టీ కార్యాలయం నిర్మిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లకు విశాఖలో జరుగుతున్న భూ ఆక్రమణలకు సంబంధాలు ఉన్నాయని, వాటిపై ఎలాంటి విచారాణ చేయనందుకే ప్రవీణ్ కుమార్ ను జెసీగా జాయిన్ అయిన దగ్గర నుంచి కలెక్టర్ వరకూ విశాఖలో ఉంచేశారన్నారు. దానికి అనుగుణంగా మంత్రి నారాలోకేష్ కి ఐఏఎస్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ మరీ దారుణంగా గులాం గిరీ చేయడం సిగ్గు చేట్టన్నారు. నగరంతోపాటు భీమిలీ, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు విలువైన భూములు కబ్జా చేస్తున్నారన్నారు. ఆవివరాలన్నీ సాక్ష్యాలతో తమ దగ్గర ఉన్నాయన్నారు. త్వరలోనే వీటిపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ కూడా చేయాలని డిమాండ్ చేశారు గుడివాడ అమర్నానాధ్
Daspalla Land issue YSRCP Amar.. Vizagvision…తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని మంత్రులకు విశాఖజిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గులాంగిరీ చేస్తున్నారని, దసపల్లా భూములను కబ్జా చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైఎస్సార్సీపి విశాఖ నగర అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. వైెఎస్సార్ సీపి కార్యాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుదూద్ సమయంలో విశాఖజిల్లాలలో చాలా రెవిన్యూ రికార్డులు పోయాయని చెబుతున్న జిల్లా కలెక్టర్, అప్పటి జీవిఎంసి కమిషనర్ గా కోర్టు లో వున్న దసపల్లా ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులకు నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. విశాఖజిల్లాతోపాటు నగరంలో కూడా కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతుంటే రెవిన్యూ అధికారులు నిమ్మకు నీరత్తనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. రెండు మూడు కేసుల్లో తహశీల్దార్లను సస్పెండ్ చేసి చేతుతు దులుపుకుంటున్నారన్నారు. విశాఖ నగరంలో ఏకంగా అర ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి టిడిపి పార్టీ కార్యాలయం నిర్మిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లకు విశాఖలో జరుగుతున్న భూ ఆక్రమణలకు సంబంధాలు ఉన్నాయని, వాటిపై ఎలాంటి విచారాణ చేయనందుకే ప్రవీణ్ కుమార్ ను జెసీగా జాయిన్ అయిన దగ్గర నుంచి కలెక్టర్ వరకూ విశాఖలో ఉంచేశారన్నారు. దానికి అనుగుణంగా మంత్రి నారాలోకేష్ కి ఐఏఎస్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ మరీ దారుణంగా గులాం గిరీ చేయడం సిగ్గు చేట్టన్నారు. నగరంతోపాటు భీమిలీ, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు విలువైన భూములు కబ్జా చేస్తున్నారన్నారు. ఆవివరాలన్నీ సాక్ష్యాలతో తమ దగ్గర ఉన్నాయన్నారు. త్వరలోనే వీటిపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ కూడా చేయాలని డిమాండ్ చేశారు గుడివాడ అమర్నానాధ్