విజయనగరం జిల్లా సాలూరు మండలం కోదమ పంచాయితీ, చింతలవలస గిరిజన గ్రామంలో గర్భిణికి ఆస్పత్రి దారిలోనే ప్రసవం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4 మధ్యాహ్నం నిండు గర్భిణీ ని డోలిలో ఆస్పత్రికి తీసుకు వస్తుoడగా మార్గం మధ్యలో నొప్పులు వచ్చాయి. గత్యంతరం లేక మరీ గిరిజన మహిళ కాన్పు చేసింది. అనంతరం తల్లి బిడ్డలను ఆస్పత్రికి తరలించారు.