గోదావరి నుంచి 2018 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి.
ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రణాళికాబద్దంగా వెళ్లాం.
ఇప్పటి వరకు రూ. 58024 కోట్లు ఇరిగేషనుకు ఖర్చు పెట్టాం.
57 ప్రాజెక్టుల్లో పది ప్రారంభించాం.
సెప్టెంబరులో 12 ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయబోతున్నాం.
12 ప్రాజెక్టులు మినహా 45 ప్రాజెక్టులు 2019 మార్చిలోగా పూర్తవుతాయి.
వచ్చే 45 రోజుల్లో మిగిలిన 12 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తాం.
గోదావరి-పెన్నా లింకేజ్ ప్రాజెక్టు మొదటి దశ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం.
వంశాధార-నాగావళి లింకేజ్ ప్రాజెక్టు ఈ ఏడాదిలోనే పూర్తి.
నీటి భద్రతే ప్రధాన అజెండా.
తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల కోసం పూర్తిగా నీరందించేందుకు చర్యలు.
చంద్రబాబు, ఏపీ సీఎం.
పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తున్నాం.
57 శాతం పనులు అయ్యాయి.
77 శాతం మట్టి పనులయ్యాయి.
వచ్చే ఏడాదిలో ఏప్రియల్-మే లోగా పోలవరం నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు.
రూ. 2736.94 కోట్లు పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది.. కేంద్రం ఇవ్వాల్సి ఉంది.
రూ. 58 వేల కోట్లతో కొత్త డీపీఆర్ పంపాం.
రూ. 22 వేల కోట్లు భూ సేకరణ, పునరావాస ఖర్చు ఉంటుంది.
లక్ష మందికి పైగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
పోలవరం నిర్మాణం నా జీవితాశయం.