టీడీపీ నేత నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి చేరుకుంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. హరికృష్ణ పార్థివదేహంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో ముందు నడిచారు. ‘హరికృష్ణ అమర్ రహే’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. దాదాపు పది కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకుంది. కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.