ఇటలీలోని జెనోవా నగరంలో ఓ వంతెన కూలినప్పుడు కనీసం 10 మంది మరణించారని ప్రాథమిక వార్తల ద్వారా తెలిసింది.
మృతుల సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని అనుమానిస్తున్నారు.
వాహనాల రాకపోకలకు నిర్మించిన ఆ వంతెన చాలా ఎత్తుగా ఉంటుంది.
సగం విరిగిపోయి కింద పడిపోవడంతో కనీసం 20 వాహనాలు చెల్లాచెదురయ్యాయి.
ఇది చాలా ఘోరమైన దుర్ఘటన.. డజన్ల మంది మరణించి ఉంటారు అని ఇటలీ రవాణామంత్రి డేనిలో టోనినెల్లి వ్యాఖ్యానించారు.
1960లలో నిర్మించిన ఈ వంతెన కు 2016లో మరమ్మత్తులు జరిపారు.
వంతెన కింది నుంచి రైళ్లు తిరుగుతాయి. వంతెన కూలడం వల్ల రైళ్ల రాకపోకలకు విఘాతం కలిగింది.