Sri Polipilli Amma’s Temple Kunkama pujas celebration at Appanna palem,Vizag….విశాఖమహనగరం అప్పన్నపాలెం గ్రామప్రజల ఆరాధ్యదేవత శ్రీపోలిపిల్లి అమ్మవారి ఆలయమండలాభిషేక మహోత్సవం వేడుకుగా నిర్వహిస్తున్నారు.ప్రతిష్ఠజరిగి మండలం రోజులుపూర్తిఅయిన సంధర్భంగా ఉత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు.ఉత్సవంలో భాగాంగ రెండవరోజు సామూహిక కుంకుపూజులు నిర్వహించారు.అమ్మవారికి ప్రత్యేకపూజులు పూర్తిఅయిన పిదప సువాసినులచే సామూహికంగా కుంకుమపూజులు నిర్వహించారు.అమ్మవారి ప్రతిమకు శోడషోపచారపూజులు అనంతరం అష్టోత్తరనామలతో కుంకుమర్చనలు నిర్వహించి మంగళనీరాజనాలను సమర్పించారు.భక్తులు అమ్మవారిని దర్శించి తీర్ధప్రసాదాలను స్వీకరించారు.