లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఉత్సవ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రవేశించిన పవన్ కల్యాణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ రాకతో ఆలయ ప్రాంగణం ఆయన అభిమానులతో సందడిగా మారింది. మరోవైపు పవన్ రాకతో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
అంతకుముందు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఆ తర్వాత ఆదయ్యనగర్ కమాన్ వద్ద నుంచి ఎంపీ కవిత బంగారు బోనంతో వచ్చి మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ఆమె వెంట 1100 మంది భక్తులు అమ్మవారి బోనాలతో వచ్చారు.