అకాశంలో అద్భుతం జరుగనుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘంగా 6 గంటలకుపైగా చంద్రగ్రహణం కనిపించనుంది. 103 నిమిషాల పాటు పూర్తిగా రక్త వర్ణంలో జాబిలి కనిపించనుంది. ఆ పక్కనే నేనున్నానంటూ మినుకుమినుకుమంటూ మెరిసే అంగారకుడు. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించే అరుదైన సందర్భం.. మన దేశంలో ఎక్కడి నుంచైనా సంపూర్ణ గ్రహణాన్ని చూసే అవకాశం.. ఇన్ని ఆకాశ అద్భుతాలకు శుక్రవారం రాత్రి వేదిక కాబోతున్నది.