Brandex Conducting Eye Medical Camps for Womens,Visakhapatnam,Vizag Vision..బ్రాండెక్స్ ఈ పేరు చెబితే చాలా మందికి విశాఖ జిల్లాలో ఉన్న ఓ సెజ్ కధా అంటారు..మరి కాస్త విషయ పరిజ్ణానం ఉన్న వారు ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అండర్ గార్మెంట్స్ కంపేనీ కధా అంటారు..ఇదంతా నిజమే అయినా దాదాపు 7 నియోజక వర్గాల్లో 20 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుంది బ్రాండెక్స్ సంస్థ..కేవలం మహిళలకు ఉపాధీ కల్పించడంలో ముందు ఉండటమే కాదు సామాజిక బాధ్యతలో కూడా తాను ముందే ఉంటాను అని నిరూపిస్తుంది బ్రాండెక్స్ సంస్థ..దాదాపు 38 ఐ క్యాంప్ లు, 15 మహిళ క్యాంప్ లు నిర్వహిస్తూ అదర్శంగా నిలుస్తుంది..సర్వేంధ్రియానాం నయనం ప్రధానం అంటారు..కంటి చూపు లేకపోతే రంగుల ప్రపంచాన్ని చూడటం అసాధ్యం..చిన్న చిన్న కంటి సమస్యలను సకాలంలో గుర్తించక పోవడం వల్ల శాస్వతంగా కంటి చూపుకు దూరం అవుతున్న వారు విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాలలో చాలా ఎక్కవ..ఈ సమస్య ను గుర్తించిన బ్రాండెక్స్ ఇండియా బాగస్వామి దోర స్వామీ విశాఖ జిల్లా అచ్చుతాపురం కేంధ్రంగా ప్రతి వారం ఐ క్యాంప్ నిర్వహించడానికి పూనుకున్నారు…చాలా చోట్ల ఐ క్యాంప్ లు నిర్వహించే వారు కేవలం టెస్ట్ లు నిర్వహించి కళ్లద్దాలు, ఆపరేషన్లు బయట తీసకోవమ్మని చెబుతారు..కాని బ్రాండెక్స్ సంస్థ కళ్లాద్దాలు ఇవ్వడమే కాకుండా రెటీనా , శుక్లాలు లాంటి కంటి సంభందిత అపరేషన్లు పూర్తి ఉచితంగా చెయిస్తుంది..ఈ క్యాంపులకు నర్సీపట్నం, బీమిలీ, మాడుగుల లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు..ఇలా ఇప్పటి వరకూ దాదాపు 38 క్యాంపులు నిర్వహించింది బ్రాండెక్స్ సంస్థ..9 వేల మందికి కళ్ల అద్దాలు ఉచితంగా ఇవ్వడంతో పాటుగా 2 వేల మందికి ఉచితంగా ఆపరేషణ్లు నిర్వహించారు…ఆడదే సృష్టికి ఇంటికి ఆదారం అంటారు..అలాంటి అడవారు సౌఖ్యంగా ఉంటే కుటుంభం సంతోషంగా ఉంటుంది..ఆడవారికి సంభందించిన సమస్యలు అనేకం ఉంటాయి..వాటిని బయటకు చెప్పుకోలేరు..దీంతో ఆ సమస్య పెద్దదవుతుంది..అందుకే బ్రాండెక్స్ సంస్థ మహిళలకు ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తుంది..మహిళలకు ఉండే మెన్సస్, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా మహిళ డాక్టర్లతో క్యాంప్ లు నిర్వహిస్తుంది..ఇప్పటి వరకూ 15 క్యాంపులు నిర్వహించిన ఈ క్యాంపులు వల్ల అనేక ఎక్కడెక్కడి నుంచో వచ్చే వేలాది మంది మహిళలు ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది..కేవలం టెస్టులు చెయ్యడం మందులు ఇవ్వడం తోనే కాకుండా మహిళలకు బలవర్ధక ఆహారం ఎలా వండాలో కూడా బ్రాండెక్స్ యాజమాణ్యమే శిక్షణ ఇస్తుంది..మహిళలకు ఇలాంటి క్యాంపులు నిర్వహించడం వల్ల ఎంతో ఉపయోగం అంటున్నారు మహిళలు..