కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ,ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించారు పోలవరం స్పిల్లవే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై గడ్కరీకి చంద్రబాబు వివరించారు ఫిబ్రవరి నాటికీ కాంక్రీట్ పనులు పూర్తిచేస్తామని చెప్పారు. త్వరలోనే జెట్ గ్రౌటింగ్ పనులు పూర్తిచేస్తామని చంద్రబాబు తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ 57 ,940 కోట్లు అవుతుందన్నారు. ఇందులో భూసేకరణకు రూ 33 వేల కోట్లు అవుతుందని చెప్పారు. 2019 డిసెంబరును డెడ్ -లైన్ గా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
పనులు అద్భుతంగా జరుగుతున్నాయి : గడ్కరీ
పోలవరం నిర్మాణ పనుల పురోగతిపై కేంద్రమంత్రి గడ్కరీ ప్రశంసలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అద్భుతమైన పురోగతి సాధించారని అయన కొనియాడారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుగా నీటివిలువ నాకు తెలుసు. ప్రధాని మోడీ సారథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ అధిగమిస్తామన్నారు. ఇంతకు ముందే పోలవరం ప్రాజెక్టును సందర్శించాల్సి ఉంది. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని, అవేంటో నీకు తెలుసు “అంటూ గడ్కరీ చమత్కరించారు. మట్టి పనులు, పునరావాసం కోసం నిధులు ఇవ్వడానికి ఆర్థిక శాఖా అనుమతి అవసరమని, పునరావాసం లో గిరిజనులకు తోలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరుతున్నామని గడ్కరీ చెప్పారు. చంద్రబాబుతో కలసి గడ్కరీ పోలవరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించారు. తరువాత కాంట్రాక్టు ఏజెన్సీలతోను, అధికారులతోను పనుల పురోగతిపై సమీక్షా నిర్వహిస్తారు. దాదాపు పది నెలల తరువాత గడ్కరీ రెండవ సారి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. గడ్కరీ పర్యటన వలన ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.