ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ‘ఆకాశవాణి’ ద్వారా ‘మన్ కీ బాత్’ వినిపించారు.
హింస, క్రూరత్వం వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు.
ఏ సమస్యనైనా హింస, క్రూరత్వం ఎన్నటికీ పరిష్కరించజాలవని తెలిపారు.
అహింసే ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.
జలియన్ వాలా బాగ్ హింసను ప్రస్తావిస్తూ హింస, క్రూరత్వం ఎన్నటికీ సమస్యను పరిష్కరించజాలవని గ్రహించాలన్నారు.
శాంతి, అహింస, త్యాగం, బలిదానం అంతిమంగా విజయం సాధిస్తాయన్నారు.
గురు నానక్, కబీర్ దాస్ కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడారని, సామాజిక సామరస్యానికి కృషి చేశారని చెప్పారు.
భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతదేశ సమైక్యత కోసం కృషి చేశారన్నారు.