“Devil Trees” in Visakhapatnam Special Story,Vizag Vision..పచ్చని చెట్లు విషాన్ని చిమ్ముతున్నాయి. కాలుష్యంతో అల్లాడిపోతున్న విశాఖాలో అడుగడుగునా డెవిల్ ట్రీస్ మృత్యు కుహరంగా మారుతూ .. ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నాయి.డెవిల్ ట్రీస్ అంటే ఏంటి … సాధారణంగా చెట్లు ప్రాణవాయువు విడుదల చేస్తాయి .. కానీ ఇవి విషవాయువు విడుదల చేస్తున్నాయంటే నిజమేనా …సెవెంత్ సెన్స్ మూవీ మీకు గుర్తు ఉండే ఉంటుంది.ప్రజల ప్రాణాలను హరిస్తున్నా విద్యాధికి చెట్లు నుండి ఔషదాన్ని పరిశోధన చేస్తారు.కానీ ఇప్పుడు అవే చెట్లు ప్రజల ఆయుష్షు తగ్గిస్తున్నాయి.విశాఖ నడి ఒడ్డున ఉన్న ప్రధాన ప్రాంతాల్లో డెవిల్ ట్రీస్ చెట్లు భయ పెడుతున్నాయి.ప్రాణాలకు ముప్పుగా పరిగణించే విష వాయువు ను విడుదల చేస్తున్నాయి.ముక్యంగా అక్టోబర్ మాసం లో ఈ మొక్కల నుంచే కాసే పువ్వులు మరింత ప్రమాద కరమని పర్యావరణ నిపుణులు చెపుతున్నారు.అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఈ డెవిల్ ట్రీస్ తొలగుంచక పోతే భవిష్యత్ లో మరిన్ని పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మొక్కలు ప్రజలకు మేలుచేస్తాయని అనుకుంటే పొరపాటే ఈ డెవిల్ ట్రీస్ ఉంటాయని ప్రతి ఒక్కరు గమనించాలి. తస్మాత్ జాగ్రత్త … అడుగడుగునా
డెవిల్ ట్రీస్ కోరలు చస్తాయి…