Truck Hits Bus in Bhogapuram,vizianagaram,Vizagvision..జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై కాశీ నుంచి వస్తోన్న యాత్రికుల బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. వీటిని మరో లారీ వెనకనుంచి వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు.
కొద్ది గంటల్లో ఇంటికి చేరుకుంటారనగా లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. ఈ ప్రమాదంలో బోల్తా పడిన బస్సు నుజ్జునుజ్జయింది. బస్సులో చిక్కుకున్న పది మంది ప్రయాణికులను పోలీసులు, సహాయక సిబ్బంది, అధికారులు బయటికి తీశారు.
ప్రమాద సమయంలో బస్సులు 42మంది ఉన్నట్లు తెలిసింది. కాగా, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ఆస్పత్రులకు తరలించారు.