ప్రముఖ మొబైల్స్ తయారీదారు బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘కీ2’ ను తాజాగా విడుదల చేసింది.
బ్లాక్, సిల్వర్ రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ రూ.43,520 ధరకు వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది.
ఈ ఫోన్ కింది భాగంలో ఫిజికల్ బటన్లు ఉన్న కీబోర్డును ఏర్పాటు చేశారు.
దీంతో మెసేజ్‌లు పంపుకోవడం, టైపింగ్ సులభతరమవుతుంది.
బ్లాక్‌బెర్రీ కీ2 ఫీచర్లు…
4.5 ఇంచ్ డిస్ప్లే, 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 4 రో ఫిజికల్ క్వర్టీ బ్యాక్ లిట్ కీబోర్డ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3360 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0