బీజేపీ చేపట్టిన సంపర్క్ ఫర్ సమర్థన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం ఆయన సంజయ్‌దత్‌ను కలుసుకున్నారు.
ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు.
మోదీ పభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన సందర్భంగా బీజేపీ ఇటీవల దేశవ్యాప్తంగా ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్దతు కోసం భేటీ) కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా ఆ పార్టీకి చెందిన 4000 మంది నేతలు ఆయా రంగాల్లోని దాదాపు లక్ష మంది ప్రముఖులను కలిసి… పార్టీ ఆశయాలను, అభివృద్ధి పనులను వివరించి వారి మద్దతు కోరడం ఈ కార్యక్రమం లక్ష్యం.