వర్షాకాలం వచ్చేసింది: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు…వేసవి కాలం ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు చల్లటి కబురు అందింది. అనుకున్నదాని కంటే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ గుండా దేశంలోకి ప్రవేశించాయి.
మంగళవారం ఈ రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు పేర్కొంది. తొలుత జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.