రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన*మందడం లో నిర్మిస్తున్న గృహ సముదాయాలను సందర్శించిన ముఖ్యమంత్రి
ఈ సముదాయంలో 14 బ్లాక్కుల్లో 440 యూనిట్లు నిర్మాణం జరుపుతున్నాము.
మందడం సమీపంలో సీడ్ ఎక్స్ సిస్ 8 రోడ్ల రహదారి పై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
రాయపూడి లో నిర్మిస్తున్న ఐ ఎ ఎస్, మంత్రుల గృహ సముదాయాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
నెలపాడు గ్రామంలో నిర్మాణం లో ఉన్న సెక్రటేరియట్ ఉద్యోగుల, నాల్గోవ తరగతి ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణాలను, నమూనాలను, డిజైన్లు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
సెక్రటేరియట్ భవన సముదాయం నుంచి వ్యూ పాయింట్ నుంచి పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
*సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్*
అమరావతి రాజధాని లో మొత్తం 32 రహదారులు సుమారు 320 కి.మీ. వస్తాయి..
ల్యాండ్ పూలింగ్ చేపడుతున్న నిర్మాణాలలో ఆరు పనులు జరుగుతున్నాయి
ఎన్జీఓ లకు చెందిన 1980 ఇళ్లు నెలపాడులో నిర్మిస్తున్నాము.
అల్యూమినియం మెటీరియల్ తో షేర్ వాల్ టెక్నాలజీ తో పకడ్బందీగా నిర్మాణాలు చేపడుతున్నాము
జిల్లా కోర్ట్ నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిలో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్వహిస్తాము.
ఇప్పటి వరకు రూ.24 వేల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతోంది
కొందరు అనవసర ప్రచారం చేస్తున్నారు, రాష్ట్రం ఖర్చు చేసే మొత్తం నుంచి కేంద్రానికి ఆదాయం వస్తోంది.
విమర్శకులకు విజ్ఞప్తి చేస్తున్నా, సహకరించండని కోరుతున్నా, అభివృద్ధి లో భాగస్వామ్యం అవ్వండి
ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి, వొచ్చే ఆరు నెలల్లో నిర్మాణాలపై ఒక అవగాహన కలుగుతుంది, సమస్యలను ఎదుర్కొంటు ముందుకు వెళుతున్నాము..
ఎక్కడ తక్కువ వడ్డీకి వొస్తే అక్కడ నుంచి బాండ్ రూపంలో నిధులు సమీకరించి అభివృద్ధి చేపడతాం.