Effects Of Solar storm On Earth Today,Vizagvision…సూర్యుని వాతావరణంలో ఏర్పడిన సౌర తుపాను ఆదివారం భూమిని తాకనుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఉహగ్రహ సాంకేతికతపై పడుడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జిపిఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ల సిగల్స్కు అంతరాయం కలుగుతాయి. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సూర్యుని వాతావరణంలో ఏర్పడిన రంధ్రం ద్వారా సౌర గాలి ప్రవాహం భూమిని తాకనుంది దీనినే సౌర తుపానుగా పిలుస్తారు. సూర్య అయుస్కాంత క్షేత్రంలో ఒక వైపు రంధ్రం నుంచి విశ్వ కణాల భారీ సమూహం, వేడి గాలులు భూమిని తాకనున్నాయి. దీనికి సంబంధించిన చిత్రాన్ని కూడా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సంస్థ విడుదల చేసింది.
ఈ సౌర తుపాను ధ్రువ ప్రాంతాల వద్ద రావచ్చనని నిపుణులు భావిస్తున్నారు. దీనిని అమెరికాకు చెందిన జాతీయ మహా సముద్రాలు, వాతావరణ యంత్రాంగ సంస్థ (ఎన్ఓఎఎ) ‘జి-1’గా లేదా ‘మైనర్’గా అంచనా వేసింది. దీనిని వలన పాక్షికంగా వెలుతరు లేకపోవడం జరుగుతుంది. అలాగే సౌర తుపాను ద్వారా వచ్చే రేడియో ధార్మికతతో క్యాన్సరు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
సౌర తుపానులను జి1, జి2, జి3, జి4, జి5లుగా వర్గీకరిస్తారు. ఆదివారం సంభవించే సౌర తుపాను ను జి1 (మైనర్)గా అంచనా వేస్తున్నారు.