Sri Pushpa Yagam Sri Varaha lakshmi narasimha swamy Simhachalam,Vizagvision,Visakhapatnam..సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామివారి వార్షికకళ్యాణ మహోత్సవాలు శ్రీపుష్పయాగంతో పరిసమాప్తి అయ్యాయి. వారంరోజులపాటు వైభపేతంగా నిర్వహించి కళ్యాణమహోత్సవాలలో చివరిగా శ్రీపుష్పయాగంతో పూర్తిఅయ్యాయి. ముందుగా స్వామివారి అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణమండపంలో శేషతల్పంపై ఉభయదేవేరుల సహిత అప్పన్నస్వామివారిని అధిష్టింపచేసి శోడషోపచార పూజలు ,విష్వక్సేన ఆరాదన , మండపారదన వంటి విశేష క్రతువులను పూర్తిచేసిన అనంతరం చతుర్వేదపారయణ , మంగళవాయిధ్యాల నడుమ స్వామివారికి గులాభి , చామంతులు , మల్లెలు ,కనకంబరాలు , సంపెంగలు, తులసీ వంటి వివిద పరిమళభరిత పుష్పలతో శ్రీపుష్పయాగం నిర్వహించారు.అనంతరం పంచహరతులు , నక్షత్రహరతులను సమర్పించారు.ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గున్నారు.