Vizag Vision:Bike Thefts Arrested Gajuwaka,Visakhapatnam..ద్విచక్ర వాహనాలను తస్కరిస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ముఠాను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.వారి నుంచి 29 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.గాజువాక స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ ఫల్గుణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మునగపాక మండలం,నాగులాపల్లి గ్రామానికి చెందిన మర్రా జగన్నాధరావు బైక్ మెకానిక్,ఇతను మరో ముగ్గురు ఉరిటి వంశీ,మైలపల్లి భరత్, తోటాడ అజయ్ కుమార్ తో కలసి విశాఖ సిటీ,రూరల్ పరిధిలో పలు చోట్ల ద్విచక్ర వాహనాలను దొంగిలించారు.గత కొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ముఠాపై దృష్టి పెట్టిన పోలీసులకు నలుగురు ఒకే చోట పట్టుబడినట్లు ఏసీపీ తెలిపారు.ముఖ్యంగా పార్కింగ్ చేసివున్న వాహనాలనే టార్గెట్ గా చేసుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు.నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు.సమావేశంలో సౌత్ సబ్ డివిజన్ క్రైం సీఐ పైడపునాయుడు,గాజువాక సీఐ కె రామారావు పాల్గొన్నారు.నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన క్రైమ్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు