Vizag Vision:Centre declares No Chances of New Railway Zone with Vizag,PM Modi gives shock to AP…ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేజోన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేశ్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తేల్చి చెప్పారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. రైల్వేజోన్ సాధ్యాసాధ్యాల నివేదికలు వ్యతిరేకంగా ఉన్నాయని, రైల్వే బోర్డు కూడా వ్యతిరేకంగా ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తామని భాజపా నేతలు కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన సంచలనంగా మారింది.
విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలనూ నెరవేర్చి తీరుతామని ప్రకటిస్తూ వస్తోన్న కేంద్ర ప్రభుత్వం రైల్వేజోన్‌కు లైన్ క్లియర్ అయిందని, ఒడిశాతోనూ చర్చలు జరిపామని, తప్పకుండా రైల్వేజోన్ ఇస్తామని ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.