Vizag Vision:YS Jagan Playing Drama again to Resign,Minister Ganta,Visakhapatnam…రాజీనామాలంటూ జగన్ మరోసారి నాటకం ఆడుతున్నారు అని రాష్ట్ర మంత్రివర్యుల శాఖ గంటా శ్రీనివాసు అన్నారు..విశాఖ ఉద్యోగుల విశ్రాంతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడుతు బడ్జెట్‌పై జగన్ ఇంతవరకూ ఒక్కమాట కూడా మాట్లాడలేదని తెలిపారు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర బడ్జెట్ అద్భుతం అని పార్టీ అభిప్రాయం తెలిపారు.పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో మరోసారి రాజీనామా డ్రామాని తెరపైకి తెచ్చారు …రాజీనామాలపై జగన్ గతంలో ఎన్నో డేట్లు ప్రకటించారు- 2016లో రాజీనామాలు చేసుంటే ఉప ఎన్నికలు వచ్చేవి, రాజీనామాలు ఏప్రిల్ 6 కాకుండా ఏప్రిల్ 1 అని చెప్పుంటే జనాన్ని ఫూల్స్ చేసుండేవారు..అయితే కేసుల మాఫీ కోసమో… అవినీతి ఆరోపణల నుంచి బయటపడటం కోసమో జగన్నాటాకం ఆడుతున్నారు అని అన్నారు..ఏదిఏమైనా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని , ఎటువంటి త్యాగాలకైనా మా పార్టీ నేతలు సిద్ధమని తెలిపారు..అయితే పాదయాత్రలో నవరత్నాలంటూ మోసపూరితమైన హామీలు ఇస్తున్నారు అని చెప్పారు..జగన్ నాటకాలను ప్రజలను నమ్మరు అని ప్రతి సంఘటనలోనూ జగన్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు అని వైసీపీ మునిగిపోయే పడవ అని హస్యపదంగా మాట్లడుతు పాదయాత్ర పూర్తయ్యేలోపు పార్టీలో ఎంతమంది నిలుస్తారో చూడాలి… ఇప్పటికైనా నరేంద్ర మోదీ, బీజేపీపై మీ అభిప్రాయం ఏంటో చెప్పాలి అని అడిగారు..అలాగే 2019లో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడతారు అని తెలిపారు.