Vizag Vision:Left Parties Bandh in industrial area is Gajuwaka & Steelplant Bandh,Visakhapatnam..వామపక్ష పార్టీల పిలుపుమేరకు విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలొ బంద్ ప్రశాంతంగా జరుగుతుంది , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాపార వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు ఆటోలు బస్సులు ఇతర ప్రభుత్వ సంస్థలు బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై , బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ప్రస్థావన రాలేదు , ఇలా ఏపీకి బిజెపి ప్రభుత్వం ద్రోహం చేసిందని ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విభజన హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున అందోళనకు దిగుతాము అని అన్ని రాజకియ పార్టీలు ముక్త కంఠం తో ఎచ్చరిస్తున్నాయి