తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆకస్మికంగా కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.ఆయన మూడు రోజుల క్రితం తీవ్రజ్వరంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు ఇటీవల గుండె ఆపరేషన్ కూడా అయినట్టు తెలుస్తోంది.
గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలుగుదేశంలో చాలా సీనియర్ నాయకుడు.