Vizag Vision:Sri Sathya Sai Bhajanamrutham Devotional Prosperity Dist Level Bhajans Visakhapatnam…అత్యంత భక్తి ప్రపత్తులతో సాగుతున్న శ్రీ సత్య సాయి భజనామృతం విశాఖ జిల్లా సమితి స్థాయి భజనల పోటీలు,ఎం వి పి కాలనీ లోని శ్రీ సత్య సాయి ప్రేమ సదన్ మందిరం లో ఈ రోజు(ఆదివారం) శ్రీ సత్య సాయి భజనామృతం పేరిట విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి సమితిల స్థాయి భజనల పోటీలు ప్రారంభమయ్యాయి.గాయనీ గాయకులతో టీం స్పిరిట్ పెంపొందించడానికి, కొత్త గాయనీ గాయకులకు అవకాశం ఇవ్వడానికి, భక్తి తో భగవంతునికి తమ గానామృతం తో సేవ లందించడానికి ఈ పోటీలను విశాఖ సిటీ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.10 సమితులనించి150 మంది గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.మొదటి బహుమతిగా హార్మొనీ పెట్టె, రెండవ బహుమతిగా 2 తబ్లాలు, మూడవ బహుమతిగా డోలక్ వాయిద్య పరికరం అందచేస్తారు.