Vizag Vision:Buddhist festival at Vijayawada..నేను సైతం.. ప్రపంచ శాంతికి…!
* బుద్దిజంలో శాంతిని మించిన సాధనం మరొకటి లేదు
* గ్లోబల్ శాంతికి దోహదం చేసేందుకు బుద్దిజం ఒక సాధనం
* గ్లోబల్ శాంతి ర్యాలీ ప్రారంభంలో వక్తలు
* విశ్వశాంతి కోసం పర్యాటక శాఖ ప్రయత్నం
* విజయవాడలో ఘనంగా ప్రారంభమైన అమరావతి బౌద్ద వారసత్వ మహోత్సవాలు
సెల్ఐటి న్యూస్, విజయవాడ: బౌద్ధంలో ఉన్న శాంతిని అమరావతి బౌద్ద వారసత్వ మహెూత్సవము ద్వారా ప్రజలకు అందించి ఏపీలో టూరిజంను ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తున్నామని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి.జయరామిరెడ్డి తెలిపారు. విశ్వశాంతి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ స్వరాజ్యమైదానంలో శనివారం నుంచి ప్రారంభమైన అమరావతి బౌద్ద వారసత్వ మహోత్సవము కార్యక్రమంలో జయరామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి రావాలని దానికి మన రాష్ట్రంలో ఉన్న పురాతన బౌద్ద స్థలాలు ఒక వేదికవుతున్నాయని తెలిపారు. గ్లోబల్ శాంతికి దోహదం చేసేందుకు బుద్దిజం ఒక సాధనంగా ఉపయోగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుద్దిజం వారసత్వ ప్రాంతాలను ప్రమోట్ చేసి టూరిజంను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలను ఇలాంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసి వారిని చైతన్యం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ అమరావతి రాజధానిలో బౌద్దంను ప్రమోట్ చేసేందుకు ఈ నెల 5వ తేదీ వరకు గ్లోబల్ శాంతి కోసం ఈ మహెూత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. గ్లోబల్ శాంతి కార్యక్రమంలో కొరియా, చైనా, తైవాన్, శ్రీలంక లాంటి 10 దేశాల నుంచి 1500 మంది మాంక్స్ 40 ప్రదేశాల నుంచి హీనయానం, మహాయానం, వజ్రయానం శాఖల నుంచి బౌద్దులు వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రదేశాల నుంచి బౌద్దులు వచ్చారని, రాష్ట్రంలో ఆచార్య నాగార్జునుడు బుద్దిజానికి చేసిన కృషి ఎనలేనిదన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గ్లోబల్ శాంతి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ర్యాలీ స్వరాజ్యమైదానం నుంచి మహాత్మాగాంధీరో్డులోని చెన్నుపాటి పెట్రోలు బంకు వరకు అక్కడ నుండి స్వరాజ్యమైదానం వరకు సాగింది. అనంతరం కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఘంటశాలలో 100 అడుగుల మహాపర్యాణం చేపట్టామని.. త్వరలోనే అది పూర్తవుతుందన్నారు. బుద్దిజంలో శాంతిని మించిన సాధనం మరొకటి లేదని, భారతదేశం సర్వసత్తాక, గణతంత్ర రాజ్యమని తెలిపారు. బుద్ధుడు ప్రపంచంలో శాంతిని కోరుకున్నాడని, అందరూ చాంటింగ్లో పాల్గొనాలన్నారు. ప్రజల్లో శాంతిని నెలకొల్పేందుకు అమరావతి రాజధానిలో 1500 మంది బౌద్దులతో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గాంధీ మహాత్ముడు దేశంలో అహింసే ఆయుధంగా పనిచేసి ప్రజలకు శాంతిని ప్రభోదించాడన్నారు.
కార్యక్రమంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమి ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, ప్రపంచం నలుమూలల నుంచి ఉపాసక, ఉపాసికలు, నగర ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.