Vizag Vision:Brahma Kumaris Universal Peace Retreat Center sankusthapana by AP CM in Nekolulu,Amravati…అమరావతి నెక్కల్లు గ్రామంలో బ్రహ్మకుమారీస్ కార్యక్రమంలో చంద్రబాబు*
రాజధాని గ్రామం నెక్కల్లు లో బ్రహ్మ కుమారీస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ నిర్మాణాని కి శంఖుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. బ్రహ్మ కుమారీస్ సెంటర్ ని ప్రారంభించడం ఆనందం.ప్రపంచంలో మానసిక ప్రశాంతతను కల్పించే ఏకైక సంస్థ బ్రహ్మకుమారీస్.మానసిక ఆనందం ఉంటె ఏ పనైనా ఆనందం గా చేయగలుగుతాం. బ్రహ్మ కుమారీస్ సెంటర్ ని కొన్నాళ్ల గా పరిశీలిస్తూ వస్తున్నాను. మానసిక ప్రశాంత త లో ఈ సంస్థ కు మంచి అవార్డు వచ్చింది. అమరావతి లో 10 ఏకారాలలో బ్రహ్మ కుమారీస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ ని మొదటి విడత నిర్మాణం సంవత్సరం లో పూర్తి చేస్తామని చెప్పారు.ఈ సెంటర్ రాబోవు రోజుల్లో అన్ని సెంటర్ల కంటే బెస్ట్ సెంటర్ గా ఏర్పాటు చేయమని కోరాను.ఈ సెంటర్ ని ఇంటర్నేషనల్ సెంటర్ గా నిర్మాణం చేయాలి,అన్నిటికంటే ముఖ్యం గా మనకు కావాల్సింది స్పిర్టువాలిటీ, ఈ రోజు నుండి ఇక్కడ దైవత్వం ఉట్టి పడాలి. జానకి దాది ఇక్కడ కు రావటం మన అదృష్టం. ఆమె 102 ఏళ్ల వయసు లో నూ ఆనందం గా ఉన్నారు. బ్రహ్మ కుమారీస్ ఎక్కడ ఉంటె అక్కడ ప్రశాంతత ఉంటుంది. మీరంత వైట్ యూనిఫారం వేసుకున్న శాంతి పోలీసులు. మీరున్న చోట పోలీసు విధులు అవసరం లేదు.