Vizag Vision:Eluru Govt Hospital Negligence Woman Dies after Delivery,Eluru..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి మరో బాలింత మృతి చెందింది. నగరానికి చెందిన జెర్రిపోతుల పద్మ 22.. సోమవారం సాయంత్రం కాన్పు నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం పధ్మ ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించి ఆపరేషన్ ధియేటర్ లో ప్రారంభించిన కొద్దిసేపటికే పద్మ వైద్యం వికటించి మృతి చెందింది. దీంతో భార్య మృతి చెందిందని తెలుసుకున్న భర్త తీవ్ర అస్వస్థత కు గురి కావడంతో ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్సఅందిస్తున్నారు. దీంతో మృతురాలు పధ్మ పట్ల ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం గా వ్యవహరించటం వల్ల చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు….