ఈ నెల 31న ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం భారత్లో కనిపిస్తుందని హైదరాబాద్లోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్ధార్థ చెప్పారు.
నగరవాసులు పూర్తిగా చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చునన్నారు.
గ్రహణం సందర్భంగా చంద్రుడు ఎర్రని వర్ణంలోకి వస్తాడని, దాన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారని అన్నారు.
బుధవారం చంద్రుడ్ని బ్లూ మూన్గా, సూపర్మూన్గానూ చూడవచ్చుని తెలిపారు.
బుధవారం సాయంత్రం 5.20 గంటలకు చంద్రగ్రహణం పాక్షికంగా ప్రారంభమవుతుంది.
కానీ, 6.25 గంటలకు సూర్యాస్తమయం తర్వాత తూర్పు దిక్కున చంద్రుడు పొడుచుకొస్తున్నప్పుడే ప్రధాన గ్రహ ణం మొదలవుతుంది అని బిర్లా సైన్స్ సెంటర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది.
స్వల్పంగా చంద్రుడు వెండి వర్ణంలోకి మారుతున్నప్పుడు దాని చుట్టూ నల్లని ఛాయ ఏర్పడుతుంది.
కొన్ని నిమిషాలపాటు విస్తరించిన మీద రాత్రి 7.25 గంటల్లోపు చంద్రగ్రహణం వీడుతుంది.
ఈ నెలలో పౌర్ణమి రావడం రెండోసారి. చంద్రగ్రహణం సందర్భంగా నదులు, సముద్రాల్లో స్వల్పంగా అలలు ఎగసిపడుతాయే తప్ప ఆందోళన చెందాల్సిందేమీ లేదని బీజీ సిద్ధార్థ తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 31న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తారు.
ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు.
గ్రహణానికి 6 గంటల ముందు ఆలయాన్ని ఆనవాయితీ ప్రకారం మూసివేస్తారు.
రాత్రి 9.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి జరుపుతారు.
10.30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.
ప్రత్యేక దర్శనాలు, సేవలు ఏవీ ఉండవు.