దేశ వ్యాప్తంగా పోస్టుమెన్, ఉమెన్ ఇక నుంచి సరికొత్త డ్రెస్లో దర్శనమివ్వనున్నారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశంలోని 90 వేల మంది పోస్టుమెన్, ఉమెన్స్ ఖాదీ వస్ర్తాలను ధరించనున్నారు.
కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, మనోజ్ సిన్హా కలిసి.. పోస్టుమెన్, ఉమెన్స్ ధరించే వస్ర్తాలను విడుదల చేశారు.
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం(కేవీఐసీ)కు ఖాదీ వస్ర్తాల కోసం రూ. 48 కోట్ల ఆర్డర్స్ ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.
పోస్టుమెన్స్కు రెండు జతల బట్టలు(రెండు షర్ట్స్, రెండు ప్యాంట్స్) పోస్టుఉమెన్స్కు రెండు జతల సల్వార్ – కమీజ్ అందజేయనున్నారు.