జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన ప్రత్యేక మహిళా విభాగాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ‘వీరమహిళ’ పేరుతో సోషల్ మీడియా బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ తన ప్రజా యాత్ర సందర్భంగా తెలిపారు.
క్రియాశీలక సభ్యులుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన మహిళలకు ఆయన అభినందనలు తెలిపారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసువచ్చే విధంగా కృషి చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు.
ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేద్దామని, దేశాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిద్దామని పవన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు