దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం జ్యూరిచ్ చేరుకుంది. పర్యటనలో భాగంగా జ్యూరిచ్-అమరావతి నగరాల మధ్య సిస్టర్ సిటీ ఒప్పందం, హిటాచీ సంస్థ, ఫ్రాన్హోఫర్ అసోసియేషన్‌తో మూడు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
పలు అంతర్జాతీయ సంస్థల సీఈవోలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సమావేశమం కానున్నారు.ఉద్యాన పంటల సాగును ఉద్యమస్ఫూర్తితో కొనస్తున్నామని, రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతుల ఆర్ధిక స్థితిగతులను వ్యవసాయం మరింత పరిపుష్టం చేయాలన్నది తమ లక్ష్యమని, లాభసాటి వ్యవసాయమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి ప్రాంతానికి ఒక ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. ప్రపంచ ఆర్ధిక వేదిక (WEF) ఆహ్వానం మేరకు నాలుగు రోజుల పర్యటనకు దావోస్ బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ముందుగా జూరిచ్ చేరుకున్నప్పుడు ఘన స్వాగతం లభించింది.
తొలిరోజు పర్యటనలో ముందుగా ‘పయొనీరింగ్ వెంచర్స్’ చైర్మన్ రోన్ పాల్, చీఫ్ ఇన్వెస్టర్ ఆఫీసర్ సందీప్ రాజ్ తో ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడుల సాధనకు టెక్నాలజీని వినియోగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి వివరించారు. ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పరిమితమై ఉన్న ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు విస్తరించాలన్న దార్శనికతతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కొన్ని జిల్లాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినా వ్యవసాయంలో వృద్ధిరేటు పెరిగిందని, వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ, రెయిన్ గన్లు, మొబైల్ ఇరిగేషన్ లాంటి రక్షక చర్యలతో వ్యవసాయ రంగం రెండంకెల వృద్ధిని సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలోనే తొలిసారిగా సెన్సర్లు,డ్రోన్లు వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రతికూల పరిస్థితులలో సైతం తమ రాష్ట్రం ఒక్క ఉద్యానరంగంలోనే 30% వృద్ధిరేటును నమోదు చేసిందని చంద్రబాబు తెలిపారు. ఆక్వా రంగాన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేశామని, ఆక్వాలో దేశంలోనే తమ రాష్ట్రం నెంబర్-1 అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
క్లస్టర్ల వారీగా ఉద్యాన పంటలు
ఉద్యాన రంగంలో వివిధ పంటల సాగును ప్రోత్సహించేందుకు పంటల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఇది వినూత్న ప్రయోగమని వివరించారు. భారీ పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థకు సీఎ సూచించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి ప్రణాళికతో రండి.మీకు అన్నివిధాలా సహకారం అందజేస్తాం. సింగిల్ డెస్క్ విధానం ద్వారా అన్ని అనుమతులను మూడు వారాల్లో ఇస్తున్నాం. నాదీ భరోసా’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ తరహాలో పాల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా పెద్దఎత్తున సహకార సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కుప్పంలో చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం. దీనివల్ల మీ ప్రయాణాలు సాఫీగా జరుగుతాయి, సరుకు రవాణా సులభతరం అవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఈ సంస్థతో సంప్రదింపులు జరిపి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఐదు వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం : పయొనీరింగ్ వెంచర్స్ చైర్మన్ రోన్ పాల్
జూరిచ్ లో పయొనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్ రోన్ పాల్ స్పందిస్తూ పండ్ల తోటలు,పాడి పరిశ్రమలో ఇప్పటికే తమ సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడుల…
రానున్న ఐదేళ్లలో రూ.5000 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ భారతంలో పెట్టుబడులు వెచ్చించాలని నిశ్చయించామని అన్నారు. పండ్లతోటల సాగు, కూరగాయల సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని, ఇందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాభివృద్ధిని పరిశీలించి భవిష్యత్తు కార్యాచరణను సవివరంగా ప్రకటిస్తామన్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయం,వ్యవసాయ ఆధారిత సప్లై చైన్ బిజినెస్ లో ‘పయోనీరింగ్ వెంచర్స్’ ఎంతో ప్రసిద్ధి చెందిన కంపెనీగా పేరుంది. మన దేశంలో ఇప్పటికే వ్యవసాయ రంగంలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టింది. మన రాష్ట్రంలోని కుప్పంలో, మహారాష్ట్రలోని నాందేడ్ లో ఇప్పటికే పయనీరింగ్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది.
జూరిచ్తో సిస్టర్ స్టేట్ ఒప్పందం
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సమక్షంలో జూరిచ్,ఆంధ్రప్రదేశ్ అధికారులు సిస్టర్ స్టేట్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం వల్ల పర్యావరణ సాంకేతికత, జీవశాస్త్రాలు, పట్టణ, ప్రాంతీయాభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. కాగా జూరిచ్ టెక్నాలజీ వినియోగంలో, వినూత్న ఆవిష్కారాలలో ఆదర్శంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఇదే బాటలో పయనిస్తున్న సత్సమయంలో జూరిచ్, ఏపీ ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం జరిగిందని చంద్రబాబు అన్నారు.
సిస్టర్ స్టేట్ ఒప్పందానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జ్యూరిచ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్మెన్ వాకెర్ స్పా, ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి బ్యూన్ సాటర్, జ్యూరిక్ ప్రభుత్వ ప్రాజెక్టు మేనేజర్ కొరిన్ వ్యేర్ భేటీ అయ్యారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ అంశాలలో జ్యూరిచ్ ఎంతో పటిష్టంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి కార్మెన్ వాకెర్ ముఖ్యమంత్రికి వివరించారువిద్యారంగానికి తాము జ్యూరిక్‌లో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు కార్మెన్ చెప్పారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలకు ప్రాధాన్యాన్ని ఇస్తామని తెలిపారు.
లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI)పై
‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ (LOI) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జ్యూరిక్ తరపున ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్మెన్, ఉప మంత్రి బ్యూన్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జూరిచ్ ఉపమంత్రి గతంలో అమరావతిని సందర్శించారు.
ముఖ్యమంత్రి బృందంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఐటి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, వ్యవసాయ సలహాదారు టి. విజయకుమార్ ఉన్నారు.