VIZAG VISION:Awareness Rally Gas Usage held by Indian oil,Visakhapatnam….భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా ఇంధనాన్ని పొదుపు చేయాలనే నినాదం తో విశాఖ బీచ్ రోడ్ లో భారత్ పెట్రోలియం అద్వర్యం లో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు . సామర్ధ్య సమతా మహోత్సవ మాసోత్సవాలలో భాగంగా జరిగిన ఈ ర్యాలీ కి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వారంలో కనీసం ఒక్క రోజైనా వాహనాలను విడిచిపెట్టి సైకిల్ ఫై ప్రయాణం చేయాలని కోరారు .అదేవిదం గా చిన్న చిన్న దూరాలు ప్రయాణించేవారు నడకను అలవాటు చేసుకోవడం ద్వారా అధిక ఇంధన వాడకాన్నిఅదుపు చేయవచ్చని అన్నారు . ప్రతీ ఏటా ఇంధన దిగుమతికి ఐదు లక్షల కోట్ల రూపాయలను విదేశాలకు చెల్లిస్తున్నామని …ఇంధన పొదుపు ద్వారా ఈ మొత్తాన్ని తగ్గించుకోవాలని సూచించారు.పెట్రోల్,డీజిల్,గ్యాస్ లను పొదుపు చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరారు. ఈ విధం గా ఆచరించినట్లైతే భవిష్యత్ తరాలకి ఇంధనాన్ని సమృద్ధిగా అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు .ఈ కార్యక్రమం లో ఎం ల్ సి మాధవ్ ,ఏయూ రిజిస్టర్ ఉమామహేశ్వరరావు ,భారత్ పెట్రోలియం మేనేజర్ సుఖేష్ తో పాటు విశాఖ పెట్రోల్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిది వెంకన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు …