VIZAG VISION:Simhachalam Appanna Teppotsavam,Visakhapatnam..సింహచలం అప్పన్న దేవస్ధానంలో తెప్పోత్సవం ఘనంగ నిర్వహించారు. శ్రీదేవి , భూదేవి సమేత వేణుగోపాలస్వామి అవతారంలో పుష్కరిణిలో హంసవాహనం పై విహరించారు. ముందుగా స్వామివారిని కోండక్రింద గల పుష్కరిణి వద్దకు శంకు , చక్రలతో పల్లకిలో తీసుకోనివచ్చారు. అనంతరం పుష్కరిణి మద్యగల మండపంలో స్వామిని హంసవాహనంపై తీసుకోనివెళ్ళి ఆరాదన శోడషోపచారల వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామిని తిరువీధి నిర్వహించారు. ఉత్సవంలో రాష్ట్ర మంత్రి శ్రీ గంట.శ్రీనివాస్ , ఆలయ ఇ.ఓ…కె.రామచంద్రమెహన్ భక్తులు పాల్గున్నారు.