VIZAG VISION:NTR 22nd Death Anniversary Family pays tributes, Jr NTR Kalyan Ram,Harikrishna,Hyderabad…దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 22వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ఘాట్‌లో కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, హరికృష్ణ ఆయన కుమారులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేటికీ అమలు అవుతున్నాయని నందమూరి హరికృష్ణ అన్నారు. అటువంటి మహానుభావుడి గురించి మాట్లాడుకునేందుకు ఎన్ని యుగాలైనా చాలవన్నారు. తెలుగు భాష ఈ భూమ్మీద ఉన్నంత వరకు ఎన్టీఆర్ మన మధ్య జీవించి ఉంటారన్నారు హరికృష్ణ. ఎన్టీఆర్ తెలుగు జాతి గుండె చప్పుడు అని బాలకృష్ణ అన్నారు.
తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అని చెప్పారు