VIZAGVISION:In AP Cock fights were converted to Gambling rather than tradition Ysrcp,Vijayawada..ఎపిలో కోడిపందేలను సంప్రదాయం ప్రకారం కాకుండా జూదంగా మార్చేశారు.
కోట్ల రూపాయల మేర పందేల రూపంలో చేతులు మారింది.పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే స్వయంగా ఈ జూదంను ప్రోత్సహించడం దారుణం
హోంమంత్రి, సిఎంలు కూడా పోలీసులను చూసిచూడనట్లు వ్యవహరించాలని సూచించడం వల్లే ఈ జూదం నడిచింది.పేకాట, గుండాట, బెల్ట్ షాప్ లు, కత్తులు కట్డి కోడిపందేలు జరుగుతూ వుంటే పోలీసులు ఎందుకు స్పందించలేదు.అధికారపార్టీ నేతలు సంప్రదాయం ముసుగులో వేల కోట్లు చేతులు మారేట్లు చేస్తున్నారు.చాటుమాటుగా జరిగే జూదం నేడు కార్పోరేట్ స్థాయికి అధికార పార్టీ నేతలు తీసుకువెళ్ళారు.
ఎంపి మాగంటి బాబు ఏర్పాటు చేసుకున్న టిడిపి కార్యాలయం నే పేకాట కేంద్రముగా మార్చేశారు.
ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు సిద్ద పడటం దారుణం.
కోడిపందేల శిబిరాల్లో అశ్లీల నృత్యాలు, బెల్డ్ షాప్ ల ఏర్పాటు, పలావు సెంటర్ కు ఏర్పాటు చేశారు.
వీటిని పెట్టుకున్నందుకు తెలుగుదేశం నేతలు, ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేయడం సిగ్గు చేటు
న్యాయస్థానాలు అంటే తెలుగుదేశం నేతలకు గౌరవం లేదా?.హోంమంత్రి సొంత నియోజకవర్గం లోనే కత్తులతో కోడిపందేలు, జూదం జరుగుతోంది..హోంమంత్రి సొంత నియోజకవర్గం లోనే కత్తులతో కోడిపందేలు, జూదం జరుగుతోంది.ఇక పోలీసులు ఎం చేయగలరు..సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ అరాచకం జరుగుతోంది.ఇక రాష్ట్రంలో చట్టాలు ఎందుకు, సంప్రదాయాలు ఎందుకు..ఇది సమాజానికి ప్రమాదకరం.
క్రికెట్ పిచ్ ల మాదిరిగా కోడిపందేల బరులు సిద్దం చేశారు.ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పందేలు నిర్వహించారు.
ప్రజల బలహీనతలను పెంచేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లే ప్రయత్నిస్తే ఎలా?
పందేల పేరుతో సామాన్యుడి జీవితాలతో ఆటాడుకుంటారా?
అంబటి రాంబాబు, వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి