Vizag Vision:మకరజ్యోతి దర్శనంతో పులకించిన భక్తులు,Sabrimala… కోట్లాది మంది భక్తులకు అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చారు.
మకర సంక్రాంతి పర్వదినాన శబరిమల కొండపై అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపుడై దర్శనమివ్వడంతో ‘‘స్వామియే శరణం అయ్యప్ప’’ అంటూ శబరిమల కొండలు అయ్యప్ప నామస్మరణలో మారుమోగాయి.
స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు.
మూడుసార్లు దర్శనమిచ్చిన జ్యోతి స్వరూపాన్ని కన్నులనిండుగా దర్శించుకుని, గుండెల నిండుగా స్వామి వారిని తలుచుకున్నారు.
ఈ ఏడాది మకరజ్యోతి చాలా స్పష్టంగా దర్శనమిచ్చిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ జన్మ ధన్యమయిందంటూ స్వామివారికి నమస్సులర్పించారు.
ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన శబరిమల కొండపై అయ్యప్పస్వామి మకరజ్యోతి స్వరూపుడై తన భక్తులకు దర్శనమిస్తున్న విషయం తెలిసిందే…