VIZAG VISION:Partition Guarantees should be fulfilled – Baba requested by the Prime Minister,Dellhi…ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధానిని ఆయన గట్టిగా కోరారు. రాష్ట్రానికి దక్కాల్సిన అన్నింటినీ మోదీ ద అష్టికి తీసుకెళ్లారు. కేంద్ర, గిరి జన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు. తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ. 16,078.76 కోట్లు ఉందని… కేంద్ర ప్రభుత్వం రూ. 7,500 కోట్లు ఇస్తామంటూ భరోసా ఇచ్చిందని, అయితే కేవలం రూ. 3,979 కోట్లు మాత్రమే ఇచ్చిందని ప్రధానికి తెలిపారు. మిగిలిన మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. విదేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనల మొత్తం రూ. 18,857 కోట్లు అని… వీటిలో రూ.
8,349 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని, మిగిలిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపాలని విన్నవించారు. నియోజకవర్గాలను పెంచాలని కోరారు.