VIZAG VISION:National level sailing competitions,Nellore….జాతీయస్థాయి సెయిలింగ్ పోటీలు కృష్ణపట్నం పోర్టులో గురువారం ప్రారంభమయ్యాయి. 21 నుంచి 25వ తేదీ వరకు జూనియర్, సీనియర్ విభాగాల్లో జరగనున్నాయి. 27 నుంచి 31 వరకు తొమ్మిదో ఎడిషన్ ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ పోటీలు జరగనున్నాయి. జాతీయస్థాయి పోటీలను కృష్ణపట్నం కోస్ట్‌గార్డ్ కమాండర్ అమిత్ ఉనియాల్ ప్రారంభించారు. కార్యక్రమానికి సిఇఒ అనిల్ యండ్లూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీలను శాప్, చెన్నరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, యారు, స్పోర్ట్స్‌్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయన్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు నెలరోజుల పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన సెయిలర్స్ ఇక్కడ ట్రైల్ రన్ చేస్తున్నారని తెలిపారు.
అందులో నేవి, కోస్ట్‌గార్డ్ ఉందన్నారు. పోటీల్లో 200 క్లబ్‌లు, 215 మంది సెయిలర్స్్ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొంటున్నారు. కృష్ణపట్నం కోస్ట్‌గార్డ్ స్టేషన్ కమాండెంట్ అమిత్ ఉనియల్ మాట్లాడుతూ.. సెయిలింగ్‌లో శిక్షణ పొందిన వారికి కోస్ట్‌గార్డ్, నేవీ వంటి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలను కృష్ణపట్నంలో నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమిళనాడు సెయిలింగ్ అకాడమీ ఛీప్ అశోక్ టక్కర్ మాట్లాడుతూ.. పోర్టు యాజమాన్యం సెయిలింగ్ పోటీలకు అనువుగా ఏర్పాట్లను చేసిందని తెలిపారు. అనంతరం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ..
సెయిలింగ్‌కు కృష్ణపట్నం పోర్టు అనువుగా ఉందన్నారు. అనంతరం కోస్ట్‌గార్డ్ కమాండెంట్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో నేవీ కమాండెంట్ మలరు, పోర్టు కెప్టెన్ ప్రదీప్ కౌర్ పాల్గొన్నారు.