VIZAGVISION:comedian Jay Sai committed suicide,Hyderabad…బొమ్మరిల్లు, అమ్మాయిలు-అబ్బాయిలు ఫేమ్ విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సమస్యలతో విజయ్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
విజయ్, అతడి భార్యకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు.
వారికి ఒక పాప ఉంది. విడాకుల అనంతరం పాప భార్య సంరక్షణలోనే ఉంది.
అయితే పాపను చూసేందుకు కూడా భార్య అనుమతించకపోవడంతో విజయ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఈ కారణంతోనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో బొమ్మరిల్లు, మంత్ర, ఏకలవ్యుడు, ఇందుమతి, నా గాళ్‌ఫ్రెండ్ బాగా రిచ్ వంటి చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన విజయ్ అందరి అభినందనలు అందుకున్నాడు.
కాగా విజయ్ ఆత్మహత్యపై తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది