ఓఖీ తుపాన్ బీభత్సంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు…
భారీ వర్షాలతో కన్యాకుమారిలో 10 మంది మృతి..దీంతో మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియాను తమిళనాడు సీఎం పలనిస్వామిసముద్రంలో 30 మంది మత్స్యకారులు గల్లంతురాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా..మరో 24 గంటలు కన్యాకుమారి, త్రివేండ్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ…..తమిళనాడులో మరో ఉపధ్రవం ముంచుకొచ్చింది..అరేబియా తీరంలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. బంగాళాఖాతం నుంచి కన్యాకుమారి మీదుగా అరేబియా సముద్రంలోకి మారిన వాయుగుండం ఓఖీ తుఫాన్‌గా మారడంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్యాకుమారికి 70 కిలోమీటర్ల దూరంలో ఓఖీ తుఫాన్ కేంద్రీకృతమై ఉందని చెన్నై వాతావరణ కేంద్రం ప్రాంతీయ డైరెక్టర్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. తీరప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.దీంతో చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి.భారీగా వర్షం పడుతుండటంతో చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. స్తంభాలు విరిగిపోవడంతో కరెంట్ సప్లై కూడా ఆగిపోయింది. తమిళనాడులోని తిరునవ్వేలి, భారీ వర్షాలతో టుటికొరిన్, విరుద్ నగర్, తంజావూర్ జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరో 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.భారీ వర్షాలకు ఇప్పటికే.. రెండు రాష్ట్రాల్లో నలుగురి చొప్పున మొత్తం 8 మంది చనిపోయారు. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 57 మంది తిరిగి రాలేదు. వారి జాడ కోసం నౌకా దళం 4 ఓడలు, 2 విమానాలతో గాలిస్తోంది. అటు లక్ష ద్వీప్ లోనూ తుఫాను విధ్వంసం కొనసాగుతోంది. కన్యాకుమారి జిల్లాలో 500కుపైగా చెట్లు నేలకూలాయని, 1000 విద్యుత్ స్తంభాలు, రెండు సెల్‌ఫోన్ టవర్లు ధ్వంసమయ్యాయని తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి ట్విట్టర్లో తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుపాను నష్టంపై ఆరా తీశారు. తుపానుతో అల్లకల్లోలంగా మారిన తమిళనాడును అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.