ఏపీలో స్వచ్ఛ విప్లవం: డంప్ యార్డ్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు సమావేశం లో పాల్గొని ఆమోదం తెలిపిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్లు ఎం. నాగలక్ష్మి, బుచ్చా రామారెడ్డిఆంధ్రప్రదేశ్ను డంప్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూ. 528.65 కోట్లతో 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ బోర్డు ఆమోదం తెలిపింది. చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎండీ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎం. నాగలక్ష్మి, బుచ్చా రామారెడ్డి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 5,385 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి, తడి చెత్త నుండి నాణ్యమైన బయో-ఫెర్టిలైజర్లను తయారు చేయనున్నారు. తద్వారా చెత్త ద్వారా సంపద సృష్టించి మున్సిపాలిటీలకు ఆదాయం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. జూన్ మొదటి వారంలో 10 క్లస్టర్లలో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. అపార్ట్మెంట్లు, విద్యాసంస్థల నుండి చెత్తను సేకరించేందుకు ఏజెన్సీలను సిద్ధం చేయడంతో పాటు, గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం 210 యూనిట్లు, మొబైల్ ఎఫ్ఎస్టీపీ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చిన్ని శ్రీనివాసరావు, రవి కుమార్, ఆరుద్ర భూలక్ష్మి, సీఈ వేణుగోపాల్ తదితర అధికారులు పాల్గొన్నారు.















