VIZAGVISION:YCP Paderu MLA Joins TDP Party,Amaravathi..వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే తెదేపాలో చేరిక పాడేరుశాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఈరోజు ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోతన మద్దతుదారులతో కలిసి తెదేపాలోచేరబోతున్నారు.
వైకాపా నుంచిమరో ఇద్దరు శాసనససభ్యులు కూడాత్వరలోనే తెదేపాలో చేరనున్నట్టుపార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గిడ్డి ఈశ్వరి తెదేపాలో చేరికపైకొన్ని రోజులుగా సంప్రదింపులుజరుగుతున్నాయి.
ఈశ్వరి పార్టీమారకుండా నచ్చజెప్పేందుకు వైకాపా నాయకులు చివరి నిమిషంవరకు ప్రయత్నించారు. విశాఖ జిల్లావైకాపా నేత కరణం ధర్మశ్రీ ఆదివారంసాయంత్రం పాడేరులోని ఈశ్వరిఇంటికి వెళ్లి సంప్రదింపులుజరిపారు. అనంతరం ఆయన మీడియాప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈశ్వరిపార్టీ మారుతున్నట్టు పత్రికల్లోచూసి వచ్చానని, ఆమె పార్టీ మారుతున్నట్టుతనకేమీ చెప్పలేదని తెలిపారు.
వైకాపా నాయకత్వం పట్ల ఈశ్వరికొన్ని రోజులుగా అసంతృప్తితోఉన్నారు.
అరకు నియోజకవర్గంలోతాను సూచించిన నాయకుల్ని కాకుండా,వేరే వారిని పార్టీ ప్రోత్సహించడాన్నిఆమె వ్యతిరేకిస్తున్నారు.పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీలో చేరారు.సోమవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.గిడ్డి ఈశ్వరితో పాటు సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. గిడ్డి ఈశ్వరి చేరికతో ఇప్పటివరకూ 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.