సమస్త కళలను పోషించే కళాకేంద్రం కళాభారతి.

అలాగే ఈనెల నాలుగవ తారీఖున శనివారం నాడు కళాభారతిలో సాయంత్రం 6 గంటలకు ప్రముఖ గజల్ విద్వాంసులు డా.గజల్ శ్రీనివాస్ గారి గజల్ గాత్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
గజల్ శ్రీనివాస్ గా పేరు గాంచిన కేశిరాజు శ్రీనివాస్ తెలుగు గజల్ గాయకుడు, నటుడు, ఉద్యమకర్త.
ఈయన 125 ప్రపంచ భాషలలో గాంధేయవాదం పై గజల్స్ పాడటం ద్వారా మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులు, లిమ్కా రికార్డ్ నెలకొల్పాడు.
తెలుగులో గజల్స్ ప్రక్రియపై ఈయన విశేష కృషి చేశాడు. ఈయన హిందీ, ఉర్దూ గజల్స్ కూడా పాడతాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాడు.
మహాత్మా గాంధీ బోధించిన అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు యుద్ధం వల్ల దుష్పరిణామాలు ఎదుర్కొంటున్న దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాల్లో శాంతి యాత్ర చేశాడు.
40 వసంతాల పాటు నిర్విరామంగా గజల్స్ గానం చేసిన మాంత్రికుడు
విశ్వవ్యాప్తంగా 10000 పైన కచేరీలు చేసిన ఘనుడు.
150 భాషల్లో గజల్ గానం చేసిన ఏకైక విద్వాంసుడు
వరుసగా మూడు సంవత్సరాలు మూడు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ఘనుడు.
గజల్ శ్రీనివాస్ పురాణ దేవాలయాలు జీవోద్ధరణ కొరకు పాటుపడ్డ భక్తుడు.
365 రోజులు వ్యవధిలో భారత, భాగవత, రామాయణ, శ్రీమద్ భగవద్గీత లను తన గానంతో ఆడియోలు రూపొందించిన గాన తపస్వి.
అలాంటి విశ్వవిఖ్యాత గజల్ గాయకునకు ” గజల్ కళాభారతి ” బిరుదుతో సత్కరిస్తున్నది విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి, ఏప్రిల్ 4 న ( శనివారం ).
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
ఈ బృహత్తర కార్యక్రమానికి చిన్న,పెద్ద, అధికార, అనధికార శ్రోతలందరికీ ఇదే మా సోదర ఆహ్వానం.
కార్యక్రమం అనంతరం ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం
అధ్యక్ష కార్యదర్శులు
కళాభారతి విశాఖపట్నం
2.2.2026














